top of page
Shiva YT

🤔🏛️ ఆరుగురు నేతలు హ్యాట్రిక్ సాధిస్తారా..? కాంగ్రెస్ పూర్వ వైభవం వచ్చేనా..?

🌐 సూర్యాపేట నియోజకవర్గం నుంచి రెండుసార్లు వరుసగా మంత్రి జగదీశ్‌రెడ్డి 2014, 2018 ఎన్నికల్లో గెలిచారు. 🎉 మరోసారి ఇదే నియోజక వర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. 📚

మంత్రి జగదీశ్ రెడ్డి చేతిలో రెండుసార్లు స్వల్ప తేడాతో ఓటమిపాలైన మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఆర్ దామోదర్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. 🗳️ ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో దామోదర్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. 🌐 దీంతో ఇద్దర నేతలు నువ్వా – నేనా అన్నట్లుగా తలపడుతున్నారు. 🔥 ఇక్కడి నుంచి హ్యాట్రిక్ విజయం కోసం మంత్రి జగదీష్ రెడ్డి ఎదురుచూస్తున్నారు. 🏆

🌍 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి జరిగిన రెండు ఎన్నికల్లో కూడా తుంగతుర్తి నియోజక వర్గం నుంచి గాదరి కిశోర్‌ 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. 🎊 బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాదారి కిషోర్ కు.. కాంగ్రెస్ అభ్యర్థిగా మందుల సామెల్ గట్టి పోటీ ఇస్తున్నారు. 🏛️ ఇక్కడి నుంచి హ్యాట్రిక్ కోసం గాదారి కిషోర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 💪 ఇక భువనగిరి నుంచి పైళ్ల శేఖర్‌రెడ్డి, ఆలేరు నుంచి గొంగిడి సునీత 2014, 2018లో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 🎉 మిర్యాలగూడ నుంచి 2014లో సిపిఐ నుంచి 2018లో బీఆర్ఎస్ తరఫున భాస్కరరావు గెలిచారు. 🏆 మరో స్థానమైన దేవరకొండలో కూడా 2014లో సిపిఐ నుంచి 2018లో బీఆర్ఎస్ తరఫున రవీంద్ర కుమార్ గెలిచారు. 🏆 వీరంతా సిట్టింగ్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 💼

bottom of page