కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేల పోరు ఇప్పుడు మున్నూరు సామాజికవర్గ పోరుగా మారింది. ఇప్పటికే కరీంనగర్ రూరల్ మండలానికి జడ్పిటిసి సర్పంచ్‌గా పనిచేసిన పురుమల్ల శ్రీనివాస్ బరిలో నిలుస్తున్నారు.
గతంలో వెలుమ సామాజికవర్గానికి కంచుకోటగా ఉన్న కరీంనగర్‌లో ఇప్పుడు మున్నూరు కాపుల ప్రాభల్యం పెరిగింది. అందుకే మూడు ప్రధాన పార్టీలు ముగ్గురు మున్నూరు కాపులకే తమ టికెట్లు కేటాయించాయి. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు లక్షల నలబై వేల ఓటర్లు ఉండగా ఇందులో ప్రధానంగా గెలుపోటములు నిర్నహించేది మున్నూరు కాపులు, ముస్లిం ఓటర్లే. ముస్లిం ఓటర్లు దాదాపుగా అరవై వేల పైచిలుకు ఉండగా.. మున్నూరు కాపుల ఓట్లు కూడా అటు ఇటుగా అదే స్థాయిలో ఉన్నారు. ప్రధాన పార్టీలకి ఇప్పుడు ఈ రెండు సామజిక వర్గ ఓట్లే కీలకం కానున్నాయి. కరీంనగర్ టౌన్‌తో పాటుగా రూరల్ గ్రామాల్లో కూడా మున్నూరు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. లక్ష ఓట్లకి పైగా ఈ రెండు సామజిక వర్గ ఓట్లు ఉండడంతో అన్ని పార్టీలకి ఇవే కీలకం కానున్నాయి.🗳️🇮🇳