🏞️ కామారెడ్డి జిల్లా, నవంబర్ 7: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కొడంగల్ నియోజకవర్గంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తోన్న కామారెడ్డి నుంచి కూడా బరిలోకి దింపింది కాంగ్రెస్ అధిష్టానం. 📢
ఇటీవల విడుదలైన అభ్యర్ధుల నాలుగో జాబితాతో ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడింది. 📄 ఈ నెల 6వ తేదీన కొడంగల్‌లో నామినేషన్ వేసిన రేవంత్ రెడ్డి.. 🗓️ నవంబర్ 10న కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. 🗳️ అనంతరం కామారెడ్డిలో 🚗 ర్యాలీతో పాటు 🎪 భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. 🗣️ ఈ సభకు కర్ణాటక సీఎం సిద్దరామయ్య హాజరు కానున్నారు. 🌟 కర్ణాటకలో అమలవుతున్న పథకాలు, అక్కడి కరెంట్ అంశానికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ సర్కార్ విస్తృతంగా నెగటివ్ ప్రచారాన్ని చేస్తోన్న ఈ సమయంలో 🌍 ఏకంగా పక్క రాష్ట్ర సీఎంయే ఇక్కడ ప్రచారానికి రానుండటంతో ఆసక్తికరంగా మారింది. 🌠