top of page

🏁 ప్రతివ్యూహం... హైస్పీడులో దూసుకెళ్తున్న పార్టీలు... 🏃‍♂️🏁

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదీ గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలన్నీ ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. 🗳️📆 ఎన్నికల నామినేషన్లు ప్రక్రియ మొదలు కావడంతో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. 🚀🔜

మంగళవారం (నవంబర్ 7) హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో జరిగే బీసీ గర్జన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. 🙌✈️ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం ఐదున్నర గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ✈️🏟️ అక్కడి నుంచి నేరుగా ఎల్‌బీ స్టేడియం వెళ్లి బహిరంగ సభకు హాజరవుతారు. 🏟️✨ బీసీ గర్జన సభను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 👥👥 లక్ష మందిని సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 📊💼 సభ ఏర్పాట్లను ఆ పార్టీ ప్రతినిధుల బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. 🧐🔍 బీసీ నినాదాన్ని ఎత్తుకున్న బీజేపీ.. 🚀🔊 తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. 💪🎤

🎪 కాంగ్రెస్ మైనారీటీ డిక్లరేషన్... మరోవైపు వరుస సభలకు టీకాంగ్రెస్ ప్లాన్ చేసింది. 👥 ఈనెల 9న ముస్లిం మైనారీటీ డిక్లరేషన్ ప్రకటన చేసేందుకు హస్తం పార్టీ సన్నద్ధమౌతోంది. 📣🎪 హైదరాబాద్ లేదా నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీ సీనియర్‌ నేత సల్మాన్ ఖుర్షిద్‌తో మైనారిటీ డిక్లరేషన్ విడుదల చేయాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది. 🎤🏟️ ఈ నెల 10న కామారెడ్డి సభ ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని కూడా టీ కాంగ్రెస్‌ సన్నద్ధమౌతోంది. 🏟️🌠 కామారెడ్డి సభకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య హాజరౌతారని తెలుస్తోంది. 🙌

🏎️ స్పీడు పెంచిన బీఆర్ఎస్... బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ నెల 9 వరకు రెండోవిడత ప్రచారంలో భాగంగా మరో 10 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. 🚗🏃‍♂️ అలాగే ఈ నెల 13 నుంచి 28 వరకూ మూడోవిడత ప్రచారంలో భాగంగా 16 రోజుల పాటు 54 ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. 🏞️🤝 ఈ నెల 25న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణకు బీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేస్తోంది. 🌇✈️

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page