top of page

తెలంగాణలో మళ్ళీ 'పవర్' ఫుల్ యుద్ధం! 😠🌩️ రాజుకుంటున్న మాటల మంటలు.. 💬

ఎన్నికల ప్రచారంలో అనూహ్యంగా తెరమీదకు వచ్చింది ఉచిత కరెంట్. 💡 ఒకప్పుడు పీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి విదేశాల్లో అన్నట్టు 3గంటల కరెంట్ పథకమే కర్నాటకలో అమలు అవుతుందంటోంది బీఆర్ఎస్‌. ⚡🌏

కర్నాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ పక్క రాష్ట్రంలో రైతులకు కరెంట్ ఇవ్వలేక చతికిలపడితే ఉద్యమాలు జరుగుతున్నాయని.. 💼🤷 తెలంగాణలోనూ గెలిపిస్తే రైతులు నష్టపోతారంటోంది బీఆర్ఎస్‌. 😔🌾 ఎన్నికల్లో ఓడితే తనకు వచ్చే నష్టం లేదని… 🗳️🏃‍♂️ కానీ ప్రజలే ఇబ్బందులు పడుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్‌. 💬👥

మరోవైపు అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే రైతుబంధు సహా నగదు బదిలీ పథకాలను నోటిఫికేషన్‌ కంటే ముందే అమలు చేయాలని పట్టుపడుతోంది కాంగ్రెస్ పార్టీ. 📜🌅 సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదని.. 🚫🤝 అయితే ఎన్నికల నేపథ్యంలో నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు హస్తం నేతలు. 💰👨‍💼 కాంగ్రెస్ పార్టీ రైతులకు శత్రువుగా మారిందన్నారు మంత్రి హరీష్‌రావు. 😠🌾 సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు హస్తం పార్టీ కుట్రలకు తెరతీసిందన్నారు. 🤝💼 రైతుబంధు ఆపితే 69 లక్షల మంది రైతులు కాంగ్రెస్‌కు డిపాజిట్‌ కూడా దక్కకుండా చేస్తారన్నారు మంత్రి హరీష్‌రావు. 💰👨‍🌾 మొత్తానికి కరెంట్ మంటలు అలా రాజుకుంటే.. 💬👥 రైతుబంధు వ్యవహారం రచ్చరచ్చ చేస్తోంది. 🌾💼 ఇంతకీ ఎన్నికల సంఘం పథకాలపై ఏం చెప్పబోతుంది 😕🗳️

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page