top of page

తెలంగాణలో ఒకే రోజు రెండు యాత్రలు 🚗 🚗

తెలంగాణలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాటర్‌ వార్‌ పీక్‌ స్టేజ్‌కి వెళ్లింది. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌గా చేసుకొని విమర్శలు చేస్తోంది కాంగ్రెస్‌. ఇప్పుడు అదే ప్రాజెక్టును ఆయుధంగా చేసుకొని హస్తం పార్టీపై కౌంటర్‌ అటాక్‌ ప్రారంభించింది గులాబీ పార్టీ.

ఇందులో భాగంగా మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్‌.. కాళేశ్వరం సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నాలు ప్రారంభించింది. రేపు ఏడు బస్సుల్లో 150 మంది నేతలు మేడిగడ్డకు వెళ్లనున్నారు. రేపు సాయంత్రం మేడిగడ్డ వద్ద కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరంను ప్రభుత్వం విఫల ప్రాజెక్ట్‌గా చూపే కుట్రలు చేస్తోందని బీఆర్‌ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా.. రాజకీయంగా కూడా సవాల్ విసురుతోంది..

అయితే, కాళేశ్వరంపై వచ్చిన విమర్శలకు సమాధానంగా బీఆర్‌ఎస్ చేపట్టిన మేడిగడ్డ పర్యటనకు కౌంటర్‌‌గా అధికారంలోని కాంగ్రెస్ పార్టీ మరో పర్యటనకు సిద్ధమైంది. పాలమూరు – రంగారెడ్డి పర్యటనకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. రేపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యటనకు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. అక్కడ పర్యటించి.. ప్రెస్ మీట్ లు కూడా పెట్టనున్నారు.

మేడిగడ్డ.. పాలమూరు రంగారెడ్డి.. ఇలా ఇటు బీఆర్‌ఎస్‌.. అటు కాంగ్రెస్‌.. ఇరు వర్గాలు ఒకే రోజు రెండు దారుల్లో ప్రాజెక్టుల బాట పట్టాయి. ఇరు పార్టీల నేతల మధ్య మాటలు అదే స్థాయిలో మంటలు రేపుతున్నాయి.. ఈ క్రమంలో మార్చ్ 1.. మరింత హీట్ ఖాయమని అర్దమవుతోంది. రేపు.. మాటల వార్.. మరింత తీవ్ర స్థాయికి వెళ్లే అవకాశం ఉందని .. రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.. 🗣️🗣️


Comments


bottom of page