top of page
Shiva YT

📣 ప్రచార పర్వంలో బీజేపీ, కాంగ్రెస్‌ అగ్రనేతలు.. 🚩

📅 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సరిగ్గా వారమే గడువుంది. దీంతో జాతీయ పార్టీల అగ్రనేతలంతా తెలంగాణలోనే మకాం వేయనున్నారు. 🏛️

బీజేపీ తరపున ప్రధాని మోదీ, అమిత్‌షా, కాంగ్రెస్‌ తరపున ఖర్గే, రాహుల్, ప్రియాంక నెలాఖరువరకూ ప్రచారం నిర్వహించనున్నారు. 🔄 దీంతో తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ పీక్స్‌కు చేరుకుంది. ఈ నెల 28కే ప్రచార గడువు ముగియనుండటంతో నేతలంతా ప్రచారాన్ని పతాకస్థాయికి తీసుకెళ్తున్నారు. 🚀 రేపటితో రాజస్థాన్‌ ఎన్నికల ప్రచార గడువు ముగియనుండటంతో బీజేపీ, కాంగ్రెస్‌ జాతీయ అగ్రనాయకులంతా తెలంగాణకు తరలిరానున్నారు. 🌐 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 25, 26, 27 తేదీల్లో తెలంగాణలోనే మకాం వేయనున్నారు. 3 రోజుల్లో 6 సభల్లో పాల్గొంటారు. బీజేపీ కేడర్‌లో జోష్‌ నింపడంతో పాటు వ్యూహరచనలో తెలంగాణ బీజేపీ నాయకత్వానికి సలహాలు కూడా ఇవ్వనున్నారు. 25న మహేశ్వరం, కామారెడ్డి సభల్లో పాల్గొంటారు మోదీ. 26న తూఫ్రాన్‌, నిర్మల్‌లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. 27న మహబూబాబాద్‌, కరీంనగర్‌ సభలకు హాజరవుతారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహిస్తారు. 🎉 అమిత్‌షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, యూపీ సీఎం యోగి కూడా తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్డీయే భాగస్వామ్యపక్షంగా తెలంగాణలో పొత్తు కూడా కుదుర్చుకున్న పవన్‌ కళ్యాణ్‌ కూడా బీజేపీ-జనసేన అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. 🗣️



bottom of page