top of page

🗳️ ఎన్నికల వేళ BRS చేతికి బలమైన అస్త్రం...🚀

📅 కేసీఆర్ కుటుంబం ప్రజాధనాన్ని దోపిడీ చేస్తోందని పదేపదే ఆరోపిస్తూ దూసుకెళ్తున్న కాంగ్రెస్‌ని రివర్స్ ఎటాక్ చేసే ఛాన్స్ దక్కింది గులాబీ పార్టీకి. 🔄

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని స్కాంగ్రెస్ పార్టీ అంటూ.. గతంలో జరిగిన కుంభకోణాల్ని ప్రస్తావిస్తూ… 48 లక్షల కోట్లు దోచుకున్నారని లెక్కలు చెబుతూ.. ఎలక్షన్ యాడ్స్‌లో దుమ్మెత్తి పోస్తోంది బీఆర్‌ఎస్. దీన్ని సీరియస్‌గా తీసుకుని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. 📣 ప్రకటనల్లో తమ పార్టీని కించపరిచారని అభ్యంతరం చెబుతూ, బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ ఈసీ దగ్గర పంచాయితీ పెట్టారు కాంగ్రెస్ నేత అభిషేక్‌ సింఘ్వీ. 📈 ఇదే సమయంలో నేషనల్ హెరాల్డ్ కేసు అప్‌డేట్ వచ్చి కేసీఆర్‌కి కొత్త బూస్ట్‌నిచ్చింది. 🔍 ఇవాళ్టినుంచి ప్రజా ఆశీర్వాద సభల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఎటాకింగ్‌ స్టయిల్ మార్చి.. 📢 సౌండ్ పెంచినా పెంచుతారు గులాబీ బాస్.

🔄 కొన్ని దశాబ్దాలుగా జాతీయ రాజకీయాల్లో నలుగుతోంది నేషనల్ హెరాల్డ్ కేసు. 📰 నేషనల్ హెరాల్డ్ పత్రికకకు పబ్లిషింగ్ బాధ్యతలు నిర్వహించే AJL సంస్థకు.. 🔍 సోనియా కుటుంబానికి చెందిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కి మధ్య లావాదేవీల్లో అక్రమాలు జరిగాయన్నది అభియోగం. 🕵️ యంగ్ ఇండియన్ సంస్థకు ప్రమోటర్లుగా ఉన్న సోనియా, రాహుల్ మీద 2012లో ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు సుబ్రమణ్య స్వామి. 🏛️ ఈ కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్, ఖర్గేలను విచారించి స్టేట్‌మెంట్లు రికార్డు చేసింది ఈడీ. 📑 ఇప్పుడు సోనియా, రాహుల్‌ ఆస్తుల్ని ఎటాచ్ చేయడం తాజా పరిణామం. 🔄

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page