top of page

👥 పార్టీల్లో చిచ్చు పెడుతున్న టికెట్ల పంపకాలు.. కన్నీటితో వీడ్కోలు పలుకుతున్న నేతలు

🎉 ఈ పార్టీ.. ఆ పార్టీ అన్న తేడా లేదు. అన్ని పార్టీల్లోనూ అదే టెన్షన్. టికెట్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్న నేతలంతా అడియాసలు అవడంతో అదిష్టానంపై గుర్రుగా ఉన్నారు. పార్టీ నేతల తీరుపై ఆగ్రహావేశాలతో కోపంతో ఊగిపోతున్నారు.

ఇంతకాలం పడ్డ శ్రమంతా వృధా అవుతుందని కన్నీళ్ల దారలతో పార్టీలకు గుడ్ బై చెప్పేస్తున్నారు. నమ్ముకున్న పార్టీలు నట్టెట్ట ముంచడంతో వరుస రాజీనామాలతో పార్టీలకు జలక్ ఇస్తున్నారు. కీలక నేతలు పార్టీలకు గుడ్ బై చెప్పేందుకు దూతలను రంగంలోకి దింపిన పరిస్థితిలో ఏ మార్పు కనిపించడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో రాజీనామాలతో శరవేగంగా మారుతున్న రాజకీయాలపై ప్రతేక కథనం..

🕰️ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పదికి పది నియోజకవర్గాల్లో ఇప్పుడు రాజీనామాల జాతర నడుస్తోంది. ఈ పార్టీ, ఆ పార్టీ అన్న తేడా లేదు.. ఈ నేత.. ఆనేత అన్న భేదబావం లేదు. అందరిది ఒకే దారి.. సముచిత స్థానం దక్కలేదని.. పార్టీకోసం చమటోడిస్తే నమ్మించి నట్టెట్ట ముంచారన్న ఆగ్రహమే కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ లిస్టులో బీఆర్ఎస్ ముందజలో దూసుకుపోతుంది. టికెట్లు దక్కకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాథోడ్ బాపురావు గులాభీ పార్టీకి గుడ్ బై చెప్పగా.. అదే బాటలో ద్వితియ శ్రేణి నాయకత్వం సైతం మీ వెంటే మేమంటూ రాజీనామాలతో కారుకు వరుస షాకులిస్తోన్నారు. ఈ క్రమంలోనే ముధోల్ నియోజక వర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తీరు నచ్చక, ఏకంగా 1000 మందికి పైగా కీలక నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడంతో అక్కడ పొలిటికల్ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. 📄🗳️👤

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page