🏞️ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో BRS అత్యధిక స్థానాలు గెలవబోతుందన్నారు మంత్రి పువ్వాడ అజయ్. 📊 అన్నీ సర్వేలు తమకే అనుకూలంగా ఉన్నాయన్నారు. 📈
మూడోసారి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. 📍 ఖమ్మంలో ఇప్పటివరకూ కాంగ్రెస్ కేవలం 2 స్థానాలే ప్రకటించిందన్నారు. 🤔 ఈ సారి ఉమ్మడి ఖమ్మంజిల్లా ప్రజలు విభిన్నంగా ఆలోచించాలని కోరారు. 🗳️ గత రెండు ఎన్నికల్లో ఒకే స్థనం గెలిపించిన కేసీఆర్ ఖమ్మం జిల్లాను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. 🌟 తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ.. 📃 మేనిఫెస్టోను కాపీ కొట్టిందని విమర్శించారు. 🔁 రివర్స్‌గా మేమే కాంగ్రెస్ పథకాలను కాపీ కొడుతున్నామని పొంగులేటి కొత్త డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు పువ్వాడ. 💼 బీఆర్‌ఎస్ విడుదల చేసిన మ్యానిఫెస్టోపై జనం నుంచి మంచి స్పందన వస్తుందన్నారు మంత్రి పువ్వాడ.
🗳️ పాలేరు నుంచి పోటీచేస్తారనుకున్న తుమ్మల నాగేశ్వరరావు అనూహ్యంగా ఖమ్మం షిఫ్ట్ అయ్యారు. 🤝 సామాజిక సమీకరణాలతో మంత్రి పువ్వాడపై తుమ్మలని పోటీకి దించుతోంది కాంగ్రెస్‌పార్టీ. 🤷♂️ దీంతో ఖమ్మం రాజకీయం తుమ్మల వర్సెస్ పువ్వాడగా మారింది. 🌍 నేతలెవరూ చేజారిపోకుండా మంత్రి ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 🤔