top of page

ఇక హైదరాబాద్ లో డ్రోన్ ఎగరేస్తే అంతే 😢

అదేంటి సడన్ గా పోలీసులు 👮 డ్రోన్ ల మీద పడ్డారు అనుకోకండి . అలా డ్రోన్ లు బాన్ చేస్తే పాపం ట్రావెల్ వీడియోలు ఇంకా వెడ్డింగ్ వీడియో లు చేస్కునే వాళ్ళు ఏమైపోవాలి చెప్పండి .

అసలే ఈరోజుల్లో మంగళ సూత్రం లేకపోయినా పెళ్లిళ్లు జరుగుతాయేమో తెలీదు కానీ ,డ్రోన్ లు లేకపోతే మాత్రం పెళ్లిళ్లు జరగట్లేదు . మరి పాపం పోలీసులు ఎందుకు వీళ్ళ పొట్టకొడుతున్నారు అనుకోకండి . వాళ్ళు ఏది చేసినా ఒక పర్పస్ ఉంటది. మన రాష్ట్రపతి శ్రీ ద్రౌపతి ముర్ముర్ గారు మన హైదరాబాద్ వస్తున్నారు మరి ✈️.దానిలో భాగంగానే ఇదంతా. రాష్ట్రపతి భద్రతా విషయాలరీత్యా ఈ నెల జూన్ 17 వరకు దుండిగల్ మరియు సైబారాబాద్ పరిథిలోని 5 కి.మీ. వైశాల్యంలో ఎటువంటి డ్రోన్ లు ఎగురకూడదు. దీనిని అతిక్రమిస్తే చర్యలు తప్పవంటున్నారు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page