top of page

🔥 తెలంగాణలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ వ్యూహం

📢 కాంగ్రెస్‌ అతిరథ మహారధులంతా హైదరాబాద్‌కి తరలివస్తున్నారు. ఇవాళ, రేపు జరగనున్న CWC సమావేశాల్లో సోనియా, రాహుల్‌, ప్రియాంకతోపాటు కాంగ్రెస్ అగ్రనేతలంతా పాల్గోనున్నారు.

2024 ఎన్నికలే టార్గెట్‌ గా నిర్వహిస్తున్న CWC సమావేశాల్లో ఇండియా కూటమి సీట్ల పంపకాలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు తదితర అంశాలపై చర్చించనున్నారు. 🚩 బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా ఇవాళ హైదరాబాద్‌ రాబోతున్నారు. 📅 కేవలం 20రోజుల గ్యాప్‌లో రెండోసారి తెలంగాణకు వస్తుండటంతో కషాయ పార్టీ నేతల్లో జోష్ నెలకొంది. ఈరోజు, రేపు అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోన్న బీజేపీ.. తెలంగాణ విమోచన దినోత్సవంతో స్పీడును పెంచనుంది. 🌻 బీఆర్‌ఎస్‌ కూడా బిగ్‌ ప్రోగ్రామ్‌తో ప్రజల ముందుకు వస్తోంది. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ ప్రారంభించబోతున్నారు సీఎం కేసీఆర్‌. పాలమూరు ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తూ భారీ ఎత్తిపోతల పథకాన్ని ప్రజలకు అంకితం చేయబోతున్నారు కేసీఆర్‌. ఇవాళే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం వెనుక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు గులాబీ బాస్.. 🚀


תגובות


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page