top of page

🏫 స్కూళ్లలో అల్పాహారం..అమలు తేదీ, పిల్లలకు వడ్డించే ఆహారం వివరాలివే..

📢 ఆయా పాఠశాలల్లోనే ఈ టిఫిన్స్ తయారు చేస్తారని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ⏰ ఉదయం ప్రార్థనకు ముందు అంటే 9.30, గంటలకు విద్యార్థులకు వేడి వేడిగా టిఫిన్ వడ్డిస్తారు. 🍱

అక్టోబర్ 24వ తేదీన దసరా కానుకాగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. 🎉 ఈ అల్పాహారం పథకం 28,807 పాఠశాలల్లోని 23,05,801 మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. 📚 ఈ పథకం ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్, మోడల్ స్కూల్స్, విద్యాశాఖ పరిధిలోని మదర్సాల్లో అమలు చేయడం జరుగుతుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.

🍽️ వివిధ పనులకు వెళ్లే తల్లిదండ్రులకు భారాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో పాటు పాఠశాలకు వెళ్లే పిల్లలకు పోషకాహారాన్ని అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు విద్యార్థులందరికీ ఉచితంగా అల్పాహారం ప్రకటించింది. 🌯🥪 👨‍👩‍👧‍👦 తద్వారా విద్యార్థుల డ్రాపౌట్స్ కూడా తగ్గించొచ్చని భావించింది. 💪📚

Коментари


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page