top of page
Suresh D

🏫 రెండున్నర కోట్ల సొంత ఖర్చుతో పాఠశాల నిర్మించిన కేటీఆర్‌ 😍

🌳🏞️ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు అంద‌రిని ఆక‌ర్షిస్తుంది…త‌న నాన్నమ్మ సోంత ఊరు పై ప్రేమ‌ను చాటుకోవడం ఇప్పుడు కామారెడ్డి జిల్లా కోన‌పూర్‌లో పండ‌గ వాతవరణాన్ని సృష్టించింది. 🎉🎊 వివరాల్లోకి వెళితే.. మంత్రి కేటిఆర్ నాన్నమ్మ వెంక‌ట‌మ్మ సోంతూరు బీబీపేట మండ‌లం కోన‌పూర్. కాగా గ‌త ఏడాది మే 10 వ తేదీన కామారెడ్డి జిల్లా కోన‌పూర్‌లో ప‌ర్యటించారు మంత్రి.

🌳🏞️ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు అంద‌రిని ఆక‌ర్షిస్తుంది…త‌న నాన్నమ్మ సోంత ఊరు పై ప్రేమ‌ను చాటుకోవడం ఇప్పుడు కామారెడ్డి జిల్లా కోన‌పూర్‌లో పండ‌గ వాతవరణాన్ని సృష్టించింది. 🎉🎊 వివరాల్లోకి వెళితే.. మంత్రి కేటిఆర్ నాన్నమ్మ వెంక‌ట‌మ్మ సోంతూరు బీబీపేట మండ‌లం కోన‌పూర్. కాగా గ‌త ఏడాది మే 10 వ తేదీన కామారెడ్డి జిల్లా కోన‌పూర్‌లో ప‌ర్యటించారు మంత్రి. 🚶‍♂️ ఆ స‌మ‌యంలోనే త‌న సోంత డ‌బ్బులతో పాఠ‌శాల భవనానికి శంకుస్థాప‌న చేశారు. అప్పటి నుంచి రెగ్యూల‌ర్‌గా మానిట‌ర్ చేస్తూనే ఉన్నారు. 🏢 రూ. రెండున్నర కోట్లతో ఆధునిక హంగుల ఈ పాఠ‌శాల భ‌వనం నిర్మించారు. 💰 దీంతో పాటుగా గ్రామంలో రూ. 10 కోట్లతో ప‌లు అభివృద్ది ప‌నులను సైతం ప్రారంభించారు. 💪 గ్రామానికి వెళ్లే దారిలో రూ.2.50 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు..75 లక్షలతో సీసీ రోడ్లు వేశారు. 🌉 అలాగే 25 ల‌క్షలతో గ్రామ పంచాయితీ నిర్మాణం చేప‌ట్టారు. మ‌రో 5 కోట్లను ప్రత్యేక నిధి కింద గ్రామానికి మంజారు చేశారు.. వీటితో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించారు. 🛣️ ఇళ్ల వరకు రోడ్లు వేశారు. 🏘️ గ్రామంలో కుల సంఘాల భవనాలు, పలు ఆలయాల నిర్మాణాలు కూడా చేపట్టారు. పాఠశాల భవనానికి సంబంధించి ట్వీట్ చేసిన కేటీఆర్‌.. నిర్మాణం పూర్తయిన బిల్డింగ్ ఫొటో, వీడియోను కేటీఆర్ ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు. 📸🎥 త్వర‌లోనే కోన‌పూర్‌కు వ‌చ్చి నిర్మాణాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. దీంతో గ్రామ‌స్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ భవనాల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్‌.. తన తల్లి శోభతో కలిసి విచ్చేయనున్నట్లు తెలుస్తోంది. 🥰🌼


bottom of page