top of page
Suresh D

మరో 14,565 ఇంజినీరింగ్‌ సీట్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్రంలో మరో 14,565 ఇంజినీరింగ్‌లో సీట్లకు కేసీఆర్‌ సర్కార్‌ అనుమతి ఇచ్చింది. కోర్ గ్రూపుల్లో ఎవరూ చేరకపోవడంతో సీట్లు వెనక్కి ఇచ్చి కంప్యూటర్ కోర్సుల్లో సీట్లను పెంచవల్సిందిగా కాలేజీలు అనుమతి కోరాయి.

తెలంగాణ రాష్ట్రంలో మరో 14,565 ఇంజినీరింగ్‌లో సీట్లకు కేసీఆర్‌ సర్కార్‌ అనుమతి ఇచ్చింది. కోర్ గ్రూపుల్లో ఎవరూ చేరకపోవడంతో సీట్లు వెనక్కి ఇచ్చి కంప్యూటర్ కోర్సుల్లో సీట్లను పెంచవల్సిందిగా కాలేజీలు అనుమతి కోరాయి. దీంతో కోర్ కోర్సుల స్థానంలో కంప్యూటర్ కోర్సుల్లో 6,930 సీట్లకు తాజాగా అనుమతి లభించింది. కొత్తగా మరో 7,635 ఇంజినీరింగ్ సీట్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.తాజాగా అనుమతించిన అదనపు సీట్లతో ప్రభుత్వంపై ఏటా రూ.27.39 కోట్ల భారం పడనుంది. ఇటీవల 86,106 ఇంజినీరింగ్ సీట్లకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో మొత్తం ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య l,00,671 చేరింది. కాగా ఈనెల 8 వరకు మొదటి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంది.


bottom of page