తెలంగాణ ప్రభుత్వం అణగారిన వర్గాల మహిళలకు గృహనిర్మాణం కల్పించే గృహలక్ష్మి గృహ పథకానికి మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఈ పథకం కింద, మహిళల పేర్లతో గృహాలు మంజూరు చేయబడతాయి ఇంకా లబ్ధిదారులు ఇంటిని నిర్మించడానికి వారి స్వంత డిజైన్‌ను ఎంచుకోవచ్చు . ఆర్‌సిసి ఫ్రేమ్డ్ స్ట్రక్చర్‌తో (RCC )పాటు మరుగుదొడ్డితో కూడిన రెండు గదుల ఇల్లు నిర్మించుకోవడానికి ఒక్కో లబ్ధిదారునికి రూ.3 లక్షలు అందజేస్తారు. ఆమోదించబడిన ఇళ్ళు గృహలక్ష్మి లోగోను కలిగి ఉంటాయి. పథకానికి అర్హత పొందాలంటే, లబ్దిదారునికి వారి సొంత ఇంటి స్థలం ఉండాలి మరియు ఆహార భద్రత కార్డు ఉండాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని లబ్ధిదారుల జాబితాలో కనీసం ఎస్సీలు 20%, ఎస్టీలు 10%, 50% బీసీలు , మైనారిటీలు ఉండాలి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకానికి రూ.12,000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. జిల్లా కలెక్టర్లు మరియు జిహెచ్‌ఎంసి కమీషనర్‌లు ఆయా ప్రాంతాల్లో పథకాన్ని అమలు చేసే బాధ్యతను తీసుకుంటారు.