🔥 ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల వార్ తీవ్రమైంది. ఇప్పుడు.. బీసీ పంచాయితీ తెరపైకి వచ్చింది. 🚩 మా వాటా మాకియ్యాలె అంటూ కాంగ్రెస్ పార్టీలో యుద్ధం ప్రకటించారు బీసీ నేతలు. 🏹
అందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు ఢిల్లీకి పయనమయ్యారు. 👥 ఇవాళ అగ్రనేతలతో భేటీకానున్నారు. 🤝 రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ నేతలతో బీసీ స్థానాలపై చర్చించనున్నారు. 🗳️ రాష్ట్ర వ్యాప్తంగా 48 సీట్లను బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 📢 ఇటీవల పీఈసీలో తీర్మానం చేసిన 34 సీట్లను 48కి పెంచాలని కోరుతున్నారు. 🤝 కాంగ్రెస్ పార్టీ గెలపునకు ఇవి కీలకంగా మారబోతాయని వివరించనున్నారు. 📜 ఇక ఇదే అంశంపై నిన్న హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో బీసీ నేతలు AICC ఇంచార్జ్ మానిక్‌రావ్ ఠాక్రేతో పాటు రేవంత్‌రెడ్డిని కలిసారు ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్, ఉపాధ్యక్షులు గాలి అనిల్, సంగిశెట్టి జగదీష్. టీపీసీసీ బీసీ నేతలు. 🤝 బీసీ నేతలకు సహకరించాలని వినతి పత్రాలు ఇచ్చారు. 📄