top of page

🤝 ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి..

🔀 అనంతరం రజిని అనే దివ్యాంగురాలికి ఉద్యోగాన్ని కల్పిస్తూ సంతకం చేశారు. రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం.. తొలి సంతకం అభయహస్తం ఫైలుపై.. ఆ తర్వాత రజిని అనే దివ్యాంగురాలికి ఉద్యోగం కల్పిస్తూ సంతకం చేసి మాట నిలబెట్టుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. కాగా.. ఉద్యోగం కల్పించాలని రజిని అనే దివ్యాంగురాలు కొంతకాలం క్రితం గాంధీభవన్ లో కలిసి రేవంత్ ను కోరగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగం ఇస్తానని హామీనిచ్చారు. ఆ మాట ప్రకారం.. రజినికి ఉద్యోగం కల్పిస్తూ ఫైలుపై సంతకం చేశారు.

📄 కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఇవే..

మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500, రూ. 500లకే మహిళలకు గ్యాస్‌ పిలిండర్‌, టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

రైతు భరోసా కింద రూ.15 వేల పెట్టబడి సాయం, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేల సాయం, వరి పంటకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌

గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

గృహ నిర్మాణానికి రూ.5లక్షల సాయం

విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌

వృద్ధులకు నెలకు రూ. 4వేల చొప్పున పెన్షన్‌, రూ. 10 లక్షల వరకూ రాజీవ్‌ ఆరోగ్యశ్రీ భీమా


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page