top of page

బీఆర్ఎస్‌ పాలనపై రేవంత్ కీలక వ్యాఖ్యలు..🌟

తెలంగాణ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నిన్నటితో ముగిసిన విషయం మనకు తెలిసిందే. ఈరోజు నుంచి కాంగ్రెస్ తన ప్రచారాంలో వేగం పెంచింది.

అధికారమే లక్ష్యంగా రామగుండం కాంగ్రెస్ విజయభేరి సభకు హాజరైన రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడటానికి దోహదపడ్డ వారిని గుర్తుచేసుకున్నారు. జానారెడ్డి అధ్యక్షతన జేఏసీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. సింగరేణి బొగ్గు కార్మికుల కష్టం అనిర్వచనీయమైనదని కొనియాడారు. తమ ఇంట్లో వండుకునేందుకు తిండి లేకపోయినా పస్తులుండి రాష్ట్రసాధనలో తమవంతు సహకారం అందించారని తెలిపారు. ఉద్యోగాలు పోతాయని బెదిరించినప్పటికీ వెనుకడుగు వేయకుండా ముందుకు సాగారని చెప్పారు. 60ఏళ్ల కళను సాకారం చేయడంలో కార్మికుల పాత్ర కీలకం అన్నారు.

ఈ దోపిడీలో కొంత వాటా కేసీఆర్ బిడ్డకు పోతుందని ఆరోపించారు. సింగరేణి కార్మికుల ఎన్నికలు వస్తే కోర్టుకు వెళ్లి వాయిదాలు వేయిస్తూ కాలయాపన చేశారన్నారు. గతంలో సింగరేణికి ఆర్థిక సాయం చేసి ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ప్రస్తుతం రామగుండంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులు మూతపడ్డాయని తాము అధికారంలోకి వస్తే తిరిగి తెరిపించి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 😊👏

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page