తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య ఉచిత కరెంట్, గ్యారంటీలు, డిక్లరేషన్ పైనే ప్రచారం జోరుగా నడుస్తుంది.
కర్నాటకలో అధికారంలోకి వస్తే రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ ఇవ్వడం లేదని బీఆర్ ఎస్ విమర్శిస్తోంది. సీఎం కేసీఆర్ ప్రతి సభలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్టుగానే కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల తాండూరు సభలో తమ రాష్ట్రంలో రైతులకు ఐదు గంటల కరెంట్ ఇస్తున్నట్టు చెప్పారు. తాము హామీ ఇచ్చినట్టు గా 24 గంటల ఉచిత కరెంట్ ను ఇవ్వడం లేదని అంగీకరించారు. ఇప్పుడు సూర్యాపేట, కోడాడ సభల్లో కూడా 5 గంటల విషయాన్నే చెప్పారు. కర్నాటకలో తామేం చేస్తున్నామో చూపిస్తాం రండి అంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు శివకుమార్. అయితే కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు సీఎం కేసీఆర్. 😄✨