🗳️ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలన్నీ స్పీడును పెంచాయి.. 🏃💨 వ్యూహాలకు పదునుపెడుతూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. 💪🔥
ఈ క్రమంలో సీఎం కేసీఆర్ పై పోటీ విషయంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 🤨📜 భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేయడం డౌటేననే ప్రచారం జరుగుతోంది. 📢🗳️ దీనికి తోడు కామారెడ్డిపై పట్టున్న పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి మార్చింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. 🏛️✨ దీంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో షబ్బీర్ అలీ సమావేశం నిర్వహించారు. 👥🤝 నిజామాబాద్ అర్బన్‌లో తన గెలుపు కోసం పని చేయాలని కేడర్‌ను కోరారు షబ్బీర్ అలీ. 🏙️🗳️ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ఇకపై పూర్తి స్థాయిలో నిజామాబాద్ అర్బన్‌పై దృష్టి సారించనున్నారు షబ్బీర్ అలీ. 👀🌆 దీంతో షబ్బీర్ అలీ లేకుండానే కేవలం తన తరపున ప్రచారం చేస్తున్న వలస నేతల బృందాలతో రేవంత్ నెట్టుకురాగలడా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ❓🤷♂️