top of page
Shiva YT

"ముఖ్యమంత్రి అభ్యర్థిపై కాంగ్రెస్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహం.." 🧩

"తెలంగాణ విషయంలో మాత్రం.." 🗺️ "ఈ సంగతెలా ఉన్నా.. తెలంగాణ విషయంలో సీఎం అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్టానం ఖరారు చేయలేదు. కానీ రాష్ట్ర నాయకత్వంలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ చీఫ్ –

ప్రస్తుత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జానా రెడ్డి, తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గా రెడ్డి).. ఇంకా చాలా మంది సీఎం రేసులో తాము ఉన్నామని చాటుకుంటున్నారు. నిజానికి అంతర్గతంగా నేతల మధ్య ఎన్ని విబేధాలున్నా.. కర్ణాటకలో ఫలించిన ఐక్యతా మంత్రాన్ని ఇక్కడ కూడా జపిస్తూ.. నేతలంతా పైకి కలసికట్టుగా పార్టీ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు." 🤔🗳️🔍 "అంతర్గతంగా ఇప్పటి నుంచే సీఎం పదవి కోసం అధిష్టానం పెద్దల వద్ద పైరవీలు చేసుకుంటున్నారు. ఈ విబేధాలు, గ్రూపులను దృష్టిలో పెట్టుకున్న అధిష్టానం సీఎం అభ్యర్థి ఎవరన్నది ముందే ప్రకటించకుండా వ్యూహాత్మకంగా మౌనం ప్రదర్శిస్తోంది." 🤐 "ఒకవేళ ముందే ప్రకటిస్తే.. సీఎం సీటు ఆశిస్తున్న మిగతా నేతలంతా సహాయ నిరాకరణ చేయడమే కాదు, తనకు దక్కని పదవి ఎవరికీ దక్కకుండా చేయాలన్న గెలుపు అవకాశాలను దెబ్బతీసే ప్రయత్నాలు సైతం చేయవచ్చు. అందుకే అధిష్టానం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది." 🤷‍♂️ "ముందు గెలుపొందితే చాలు.. సీఎం ఎవరన్నది తర్వాత చూసుకోవచ్చు అన్న ధోరణిని అవలంబిస్తోంది. ‘లీడర్’ కేంద్రంగా జనం ఓట్లేస్తున్న ఈ తరుణంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహం ఫలిస్తుందా.. బెడిసికొడుతుందా అన్నది మరికొద్దిరోజుల్లో తేలనుంది." 🗳️🕵️‍♂️🚀

bottom of page