తెలంగాణలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతూ.. 🎯 ప్రణాళికలను రచిస్తోంది. 📝
తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. 🗳️ ప్రజల్లోకి వెళ్ళేందుకు సిద్ధమవుతోంది. 💪 ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఢిల్లీకి చేరింది. 🏛️ ఇప్పటికే రాష్ట్రంలో అనేక దఫాలుగా చర్చలు జరిపిన స్క్రీనింగ్ కమిటీ ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో అభ్యర్థుల వడపోతపై దృష్టి సారించింది. 👀 ఏఐసీసీ కార్యాలయంలో నిన్న సమావేశమైన కమిటీ.. 📅 ఈరోజు, రేపు సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది. 📆 కమిటీ సమావేశంలో ఛైర్మన్ మురళీధరన్, సభ్యులు జిగ్నేష్ మేవానీ, సిద్ధిఖీ, ఎక్స్ అఫిషియో సభ్యులుగా రాష్ట్ర ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. 🧑💼 తాజాగా, అధిష్టానం స్క్రీనింగ్ కమిటీలోకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కి గౌడ్ లకు కూడా అవకాశమిచ్చింది. 🤝