TS 10th Results 2023 : తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 3వ తేదీన పదోతరగతి పరీక్షలు ప్రారంభించారు. ఏప్రిల్ 11తో ప్రధాన పరీక్షలు ముగియగా.. ఏప్రిల్ 11తో ఒకేషనల్ పరీక్షలు, ఏప్రిల్ 13తో ఓరియంటెల్ పరీక్షలు ముగిశాయి.
TS Inter Results 2023 : తెలంగాణలో మే 15న 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 10వతరగతి, ఇంటర్ పరీక్షలు పూర్తిచేసిన విద్యాశాఖ అధికారులు ఇక ఫలితాలపై దృష్టి సారించారు. రాష్ట్రంలో ఏప్రిల్ 3వ తేదీన పదోతరగతి పరీక్షలు ప్రారంభించారు. ఏప్రిల్ 11తో ప్రధాన పరీక్షలు ముగియగా.. ఏప్రిల్ 11తో ఒకేషనల్ పరీక్షలు, ఏప్రిల్ 13తో ఓరియంటెల్ పరీక్షలు ముగిశాయి. మూల్యాంకన ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది.ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 21 వరకు మూల్యాంకనం చేపట్టి.. ఆ తర్వాత టాబ్యులేషన్ నిర్వహించి మే 15న టెన్త్ ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకు 4.8 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే.. ఫలితాల విడుదల తేదీపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది.అలాగే.. ఎంసెట్, నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలు ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఇంటర్ వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తిచేసి.. మే 10న ఇంటర్ ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 9 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూలు ప్రకారం మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో ఏప్రిల్ 3వ తేదీన పదోతరగతి పరీక్షలు ప్రారంభించారు.