డిసెంబర్ 4న కేబినెట్ సమావేశం జరగనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన..
మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు సీఎంవో తెలిపింది. దీన్ని బట్టి విజయంపై సీఎం కేసీఆర్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నట్లు అర్థమవుతుంది. నవంబర్ 30న అసెంబ్లీ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.
ఓట్ల జాతర ఒడిసింది. ఒడ్డెక్కదెవరు? ఓడెదెవరు. డిసెంబర్ 3 రిజల్ట్ డేపైనే ఇప్పుడు అందరి దృష్టి. అన్నిపార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా.. మరికొన్ని కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఇకపోతే పోలీంగ్ డే జనజాతరను తలపించింది. ఓటర్లు పల్లెబాట పట్టడంతో పట్నం బోసిపోయింది. ఓటింగ్‌లో అది రిఫ్లెక్టయింది. అర్బన్ ఏరియాలతో పోలిస్తే రూరల్‌లో ఈసారి పోలీంగ్ గ్రాఫ్ లేచింది. కొన్ని చోట్ల పెరిగిన ఓటింగ్ ఎవరికి ప్లస్.. కొన్ని తగ్గిన పోలింగ్ ఎవరికి మైనస్ అనే లెక్కలేయడం కూడా షురూ అయింది. 😊