top of page

మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే – సీఎం కేసీఆర్ 🌐

తెలంగాణలో ప్రచారానికి మరొక్క రోజే మిగిలి ఉంది. ఎన్నికల వ్యూహాలు, జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు, ప్రతిపక్షాలకు కౌంటర్లతో ప్రచారంలో కాక రేపుతున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇప్పటికే అన్ని జిల్లాలను చుట్టేసిన కేసీఆర్.. తాజాగా చేవెళ్ల బహిరంగ సభలో పాల్గొన్నారు.

తెలంగాణ పేదరికం లేని రాష్ట్రం కావాలి, కేరళలా వందశాతం అక్షరాస్యత సాధించడమే తన పంథం అన్నారు సీఎం కేసీఆర్. రైతాంగం గుండెమీద చేయి వేసుకొని ఆ హాయిగా నిద్రపోవాలి.. తెలంగాణలో ప్రతి ఇంచుకు నీళ్లు తేవడం కోసమే తన తండ్లాట అన్నారు. తెలంగాణ తీసుకువచ్చిన పేరే ఆకాశమంత పెద్దదని.. అంతకుమించిన పదవి ఏదీ లేదన్నారు కేసీఆర్. 🚀


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page