top of page
Shiva YT

🤔 "వ్యక్తిగతంగా దూషించే రాజకీయాలను అనుమతిద్దామా..?"–ఎమ్మెల్సీ కవిత

📍 నిజామాబాద్ ఎమ్మెల్సీ క‌విత, ఎంపీ అర్వింద్ మ‌ధ్య మాట‌ల యుద్దం తారాస్థాయికి చేరింది. 🌆🏛️ నిజామ‌బాద్ అర్బన్‌లో జ‌రిగిన బీజేపీ విస్తృత స్థాయి స‌మావేశంలో అర్వింద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పోలిటిక‌ల్‌గా తీవ్ర చ‌ర్చకు దారి తీశాయి. 💬📢

📢 మేనిపెస్టో గురించి మాట్లడుతూ అర్వింద్.. 📜🗨️ బీఆర్ఎస్ జీవిత భీమాకు ధీటుగా త‌న సొంత మేనిపెస్టో ప్రక‌టించారు అర్వింద్. 📖🔍 ఇదే ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. 🔄💡 దానితో పాటు క‌విత కాంగ్రెస్‌లోకి ప‌లువురు బీఆర్ఎస్ నేతలను పంపిస్తున్నారంటూ ఆరోపించ‌డం హాట్ టాపిక్‌గా మారింది. 🚫

🏛️ ఆర్వీంద్ వ్యాఖ్యలపై సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్సీ క‌విత. 🎤🎬 సోష‌ల్ మీడియా వేదికగా కౌంటర్ వీడియోను రీలిజ్ చేశారు. 📹📺 వ్యక్తిగత కక్షలకు తెలంగాణలో తావులేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 📢🗣️

🔍 ఆడబిడ్డలను దూషించే నేతల్ని దూరం పెట్టాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. 🚫🤝 నిజామాబాద్‌లో ఓడిపోయినా చాలా హుందాగా పనిచేసేవారికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో మౌనంగా ఉంటున్నానన్నారు. 🙏👥 బాధ్యతను విస్మరించిన ఎంపీ ఇష్టం వచ్చినట్లు తనపై వ్యక్తిగత దూషణలకు పాల్పడితే సహించేదీ లేదని హెచ్చరించారు కవిత. 🚨🧐

👥 ఇదిలావుంటే అర్వింద్ గెలిచిన నాలుగేళ్లల్లో ఎక్కడ అర్వింద్ పేరును ప్రస్తావించ‌లేదు కవిత. 🤷‍♂️🤷‍♀️ ఆరోప‌ణ‌లు కూడ అర్వింద్ పేరుతో చేయ‌కుండా స్ట్రాట‌జీగా వ్యవహరించిన క‌విత.. 🕵️🔍 చివ‌రికి పైర్ బ్రాండ్ లెవ‌ల్‌లో విరుచుకుప‌డ్డారు. 💼👁️ దీంతో అటు మహిళా నేతలు, మహిళల సానుభూతి కూడా క‌వితకు రావ‌డంతో డిపెన్స్‌లో ప‌డ్డారు ఎంపీ అర్వింద్. 👩‍💼👩‍💻 ప్రజ‌లే తేల్చాలి.. ఇలాంటి వాళ్లను ఏం చేయాలని క‌విత అప్పీల్ చేయ‌డం చ‌ర్చనీయ‌శంగా మారింది. 🤝🗳️

bottom of page