top of page
Shiva YT

📢 ఎమ్మెల్యే అభ్యర్థులుగా కేంద్ర మంత్రులు, ఎంపీలు..

🇮🇳 భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యూహాత్మకంగా కేంద్ర మంత్రులు, ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపుతోంది. 🗳️ వారికున్న పేరు, ప్రాబల్యంతో కేవలం వారు పోటీ చేసే సీటు మాత్రమే కాదు, చుట్టుపక్కల సీట్లను కూడా ప్రభావితం చేసి గెలిపిస్తాని భావిస్తోంది. 🏆

తాజాగా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో అభ్యర్థులుగా ముగ్గురు కేంద్ర మంత్రులతో పాటు నలుగురు ఎంపీలను రంగంలోకి దించింది. 🎯 సూపర్-7గా వ్యవహరిస్తున్న ఈ ఏడుగురు నేతలు పార్టీ బలహీనంగా ఉన్న చంబల్ ప్రాంతంలో 20-22 సీట్లను ప్రభావితం చేస్తారని అంచనా వేస్తోంది. 📊 🗳️ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు మొత్తం 230 స్థానాలకు గాను 78 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 🌐 సోమవారం విడుదల చేసిన బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాలో ఉన్న పేర్లపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. 📢 ముగ్గురు కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్తే ఉన్నారు. 🌟 నలుగురు ఎంపీల్లో రాకేష్ సింగ్, గణేష్ సింగ్, రీతి పాఠక్, ఉదయ్ ప్రతాప్ సింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగారు. 🤝 ఈ సూపర్-7 టీమ్‌ను బీజేపీ ఎందుకు ప్రయోగిస్తుంది అన్నదే చర్చనీయాంశంగా మారింది. 📣


bottom of page