ఈ ఫీచర్ సహాయంతో మీరు కోరుకున్న చాట్ లేదా వాట్సాప్ గ్రూప్‌లను ఎవరికీ కనిపించకుండా చేయొచ్చు. ఇంతకీ ఈ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే.. 🕵️♂️🔒
మీ వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవాలి. అనంతరం మీ ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయాలి. తర్వాత మీరు లాక్ చేయాలనుకుంటున్న చాట్‌ను ఓపెన్ చేసి, ప్రొఫైల్‌పై క్లిక్ చేయాలి. తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ‘చాట్ లాక్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేసి ‘లాక్ దిస్ చాట్ విత్ ఫింగర్ ప్రింట్’ అనే ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. దీంతో ఒకపై ఆ చాట్ మెయిన్ చాట్ బాక్స్‌లో ఎవరికీ కనిపించదు. మరి మళ్లీ ఆ చాట్‌ను ఎలా ఓపెన్ చేసుకోవాలనేగా.. ఇందుకోసం వాట్సాప్‌ను ఓపెన్ చేసి.. కిందికి స్క్రోల్ చేయాలి, ఇలా చేస్తే లాక్‌డ్ చాట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి థంబ్ నెయిల్‌తో అన్‌లాక్ చేసుకుంటే సరి మీరు హైడ్ చేసిన చాట్ ఓపెన్ అవుతుంది. 🔒📲💬