📱 ఇకనుంచి అలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ వాట్సాప్ యూజర్‌లందరికి ఓ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు మెటా సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ తెలిపారు.
📸 వాట్సాప్‌లోనే హై క్వాలిటీ ఫోటోలు పంపుకోవచ్చు. ఇది వినియోగించడానికి ముందుగా చాట్ మెనూలో ఉన్న కెమెరా ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కావాల్సిన ఫోటోను సెలక్ట్ చేసుకున్న తర్వాత పైన హెచ్‌డీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అంది సెలక్ట్ చేసుకున్నట్లైతే ఫొటో మంచి క్వాలిటీతో ఇతరులకు పంపుకోవచ్చు.
😊 ఒకవేళ హెచ్‌డీ అక్కర్లేదూ అనుకుంటే మామూలుగానే పంపించుకోవచ్చు. ఈ సదుపాయం ఇప్పటికే కొందమందికి అందుబాటులోకి రాగా.. త్వరలో మిగిలిన వారికీ కూడా అందుబాటులోకి రానుంది. ఒకవేళ మీరు వాట్సాప్ అప్‌డేట్ చేసుకోనట్లైతే ఓసారి గూగుల్ ప్లేస్టోర్/ యాపిల్ యాప్ స్టోర్‌కు వెళ్లి యాప్‌ను అప్‌డేట్ చేసుకోండి. 😉