🎧 ఎయిర్ పాడ్స్ వినియోగదారులకు ఎదురయ్యే ప్రధాన సమస్య ఎయిర్ పాడ్ మీ ఫోన్ కి కనెక్ట్ కాకపోవడం. దీనికి ప్రధాన కారణం ఐఫోన్ మైక్రోఫోన్ యాక్సెస్ ను నిరాకరించడం. మొదటిగా మీరు ఎయిర్ పాడ్ కనెక్ట్ చేయాలంటే ఐఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ఆ మైక్రోఫోన్ యాక్సెస్ ను ఇవ్వాలి.
అప్పటికీ ఎయిర్ పాడ్స్ పనిచేయకపోతే.. ఒకసారి దానిని శుభ్రం చేసి ప్రయత్నించాలి. అయినా కూడా అవి పనిచేయకపోతే యాపిల్ సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్తారు. అయితే అలా కాకుండా మరో పరిష్కారం కూడా ఉంది. అదేంటేంటే మరోసారి సెట్టింగ్స్ లోకి వెళ్తే దానిలో కుడి, ఎడమ ఎయిర్ పాడ్స్ లలో ఏదో ఒకటి మాత్రమే ఉపయోగించుకునే వీలు ఉంటుంది. మైక్రోఫోన్ ఇన్ పుట్ గా ఏదో ఒకటి మాత్రమే వాడే విధానాన్ని డీఫాల్ట్ ఆటోమేటిక్ మోడ్లో ఉంటుంది. కాల్స్ వచ్చినప్పుడు ఆటోమీటిక్ గా ఏ వైపు ఇయర్ బడ్ ఉపయోగించాలో అదే నిర్ణయిస్తుంది. ఒకవేళ మీరు మాన్యువల్ గా కూడా చేసుకోవాలనుకుంటే సెట్టింగ్స్ లో ఆ సౌలభ్యం కూడా ఉంటుంది. అదెలా మార్చుకోవాలో చూద్దాం..
📱 ఐఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి సెట్టింగ్స్ ను ఓపెన్ చేయాలి. దాని ఎగువన ఎయిర్ పాడ్స్ ఆప్షన్ పై ప్రెస్ చేయాలి. మీకు ఓపెన్ అయిన సెట్టింగ్స్ పేజీలో కిందికి స్క్రోల్ చేస్తే మైక్రోఫోన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి, ఏదో ఒకవైపు ఇయర్ బడ్ ను ఎంపిక చేసుకోండి. తర్వాత ఎవరికైనా కాల్ చేసి చెక్ చేసుకోండి. కాల్ వినపబడకపోతే మళ్లీ మరోవైపు ఇయర్ బడ్ కి సెట్టింగ్ మార్చి మళ్లీ కాల్ చేసి చెక్ చేసుకోవాలి. అప్పుడు ఇయర్ బడ్ లో వాయిస్, ఆడియో క్లారిటీ సరిగ్గా ఉంటుంది. 🎤