top of page

📱 దేశంలోనే చవకైన 5జీ ఫోన్ ఇదే.. 📱

📞 ఐటెల్ ఇండియా దీంతో పాటు మరో ఫోన్ ఐటెల్ ఎస్ 23ప్లస్ ని కూడా పరిచయం చేసింది. ఇది కర్వడ్ అమోల్డ్ డిస్ ప్లే తో వస్తుంది. ఇప్పుడు ఐటెల్ పీ 55 5జీ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వివరాలు తెలుసుకుందాం.. 📞

📱 ఐటెల్ పీ55 5జీ ఫోన్ ధర, లభ్యత.. ఈ స్మార్ట్ ఫోన్ బ్లూ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది. 8జీబీ+ 128జీబీ వేరియంట్ లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 9,999గా ఉంది. ఈ ఫోన్ అక్టోబర్ 4 నుంచి అమెజాన్ ఇండియా సైట్లో అమ్మకానికి వస్తుంది. 📱

📋 ఐటెల్ పీ55 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు.. ఈ 5జీ స్మార్ట్ ఫోన్ 6.6-అంగుళాల హెచ్ డీ ప్లస్(1600 x 700 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. డ్యూయల్ నానో సిమ్ స్లాట్స్ ఉంటాయి. 90హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఏఆర్ఏం మాలి జీ 57 ఎంసీ2 జీపీయూతో కూడిని ఆక్టా కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 6080 ఎస్ఓసీ ద్వారా అందించబడుతుంది. ఇది మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 256జీబీ వరకు విస్తరించవచ్చు. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. 📋

📸 ఈ ఫోన్లో వెనుక వైపు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా యూనిట్‌తో పాటు ఎల్ఈడీ ఫ్లాష్‌ ఉంటుంది. సెకండరీ ఏఐ కెమెరాను కలిగి ఉంటుంది. ముందు కెమెరా 8-మెగాపిక్సెల్ సెన్సార్‌ ఉంటుంది. ఫోన్ 18వాట్ల వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 📸

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page