top of page
Shiva YT

🔒 మీ వాట్సాప్ చాట్ ఇక మరింత భద్రం..

🔐అందరికీ అందుబాటులోకి..🌟వాస్తవానికి ఈ ఫీచర్ గురించి గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందరికీ అందుబాటులోకి రాలేదు. 📱 వాబీటాఇన్ ఫో నివేదిక ప్రకారం వాట్సాప్ వెబ్ తాజా ఫీచర్ తో కూడిన వెర్షన్ వారికి అలాగే అధికారిక బీటా ప్రోగ్రామ్లో భాగమైన బీటా టెస్టర్లకు ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది.

🛡️ఇలా ఎనేబుల్ చేయాలి.. 🔒 వాట్సాప్ లో స్క్రీన్ లాక్ ఫీచర్ ఎనేబుల్ చేస్తే.. వీ చాట్లు అన్ని లాక్ అవుతాయి. 🛡️ మళ్లీ పాస్ వర్డ్ ఎంటర్ చేస్తేనే చాట్లు ఓపెన్ అవుతాయి. వినియోగదారులు ఇంకా దీనిని యాక్టివేట్ చేయకపోతే.. ముందు మీ వాట్సాప్ ని అప్ డేట్ చేసుకోవాలి. తర్వాత వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ప్రైవసీని క్లిక్ చేయాలి. 🕵️‍♂️ దానిలో స్క్రీన్ లాక్ పాయింట్ అనేది మీకు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి, పాస్ వర్డ్ సెట్ చేసుకుంటే సరిపోతోంది. ఈ పాస్‌వర్డ్ ప్రాంప్ట్ ఎప్పుడు కనిపించాలో ఎంచుకోవడం ద్వారా వినియోగదారులు ఫీచర్ ని కాన్ఫిగర్ చేయవచ్చు. పాస్‌వర్డ్ మర్చిపోయినట్లయితే, వాట్సాప్ వెబ్ నుండి లాగ్ అవుట్ చేసి, క్యూఆర్ తో మళ్లీ స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది.

🔐 అదనపు భద్రత.. 🔒 స్క్రీన్ లాక్ ఫీచర్‌ను ప్రారంభించడం వలన మీ ప్రైవసీకి అదనపు లేయర్ యాడ్ అవుతుంది. వినియోగదారు దూరంగా ఉన్నప్పుడు ఎవరైనా కంప్యూటర్‌కు యాక్సెస్‌ చేస్తే మీ పర్సనల్ చాట్లు భద్రంగా ఉంటాయి. అవి పాస్‌వర్డ్ లేకుండా చాట్లు ఓపెన్ కావు కాబట్టి మీకు టెన్షన్ ఉండదు. ఈ వెబ్ బీటా తాజా వెర్షన్‌తో స్క్రీన్ లాక్ ఫీచర్ క్రమంగా అందరి వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. 🌐 రాబోయే వారాల్లో మరింత మంది వ్యక్తులు అప్‌డేట్‌ను అందుకోవచ్చని భావిస్తున్నారు. 📈

bottom of page