top of page

🕒📱 రెండు గంటల్లో 30 వేల ఫోన్‌లు అమ్ముడుపోయాయి..

📲📦 రియల్‌మీ జీటీ 5 5జీ స్మార్ట్ ఫోన్‌ లేటెస్ట్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇందులో 24 జీబీ ర్యామ్‌ను అందించారు. ప్రస్తుతం వరల్డ్‌ వైడ్‌గా 24 జీబీతో పనిచేస్తున్న స్మార్ట్ ఫోన్‌లు కేవలం రెండు మాత్రమే ఉన్నాయి. అందులో రియల్‌మీ జీటీ5 ఒకటి.📲📦

📲📦 ఇక ఇటీవల ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించి నిర్వహించిన తొలి సేల్‌లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరిగాయి. కేవలం 2 గంటల్లోనే ఏకంగా 30 వేలకిపైగా ఫోన్‌లు అమ్ముడు పోవడం విశేషం. 📱💲

ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే 12 జీబీ ర్యామ్‌, 256 స్టోరేజ్‌ ధర రూ. 35,000కాగా, 16 జీబీ ర్యామ్‌, 512 స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 37,500కాగా, 24 జీబీ ర్యామ్‌, 1 టీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 43,000గా ఉంది.

📺📲 ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.74 ఇంచెస్‌తో కూడిన 1.5 కే ఓ ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు.

📸🤳 కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఆన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఇచ్చారు. 🔋 బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 240 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4600 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందిచారు.

Comments


bottom of page