🔵📞 రిలయన్స్ జియో ఇటీవల భారతదేశంలో జియో భారత్ పేరుతో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ 4G సపోర్ట్ ఇస్తుంది. ఇక ధర కేవలం 999 రూపాయలు మాత్రమే. 📶📱 ఇప్పుడు ఈ ఫోన్ విక్రయ తేదీని అమెజాన్ ప్రకటించింది. Jio Bharat 4G ఫోన్ ఆగస్టు 28 మధ్యాహ్నం 12 గంటల నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంది. ⏰📅
🟢📱 భారతదేశాన్ని ‘2G-రహిత భారత్’గా మార్చడానికి Jio ఈ ఫోన్‌ను విడుదల చేసింది. Jio Bharat 4G ఫోన్ చాలా తక్కువ ధరకు విక్రయించబడుతుంది. 💚📞 వినియోగదారులు రిలయన్స్ డిజిటల్ స్టోర్, జియో మార్ట్‌తో సహా రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. 🏪🛒
📞🔊 జియో భారత్ ఫోన్ ఇతర ఫీచర్ ఫోన్‌ల మాదిరిగానే కనిపిస్తుంది. కీ-ప్యాడ్ ఆప్షన్, వెనుక కెమెరా, స్పీకర్, జియో లోగో ఉన్నాయి. ⌨️📷🔈 ఇక కాల్స్ విషయానికి వస్తే.. భారతదేశంలో ఎక్కడికైనా అపరిమితంగా ఫ్రీ కాల్స్ చేసుకునే అవకాశం ఉంది. ☎️📞
💳💸 Jio Bharat 4G ఫోన్‌లలో Jio Pay ద్వారా UPI లావాదేవీలు చేయవచ్చు. జియో సినిమా, జియో సావన్, FM రేడియోల ఫీచర్స్ కూడా ఉన్నాయి. 🎬🎶📻 మొత్తం 1 మిలియన్ జియో భారత్ ఫోన్‌లు ప్రారంభించడం జరిగింది. 📈📱
💰💹 జియో భారత్ ఫోన్‌ల కోసం బేస్ రీఛార్జ్ ప్లాన్ కూడా ప్రకటించబడింది. ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ.123 మాత్రమే. అపరిమిత వాయిస్ కాల్స్, 14GB డేటాను పొందవచ్చు. దీనికి ఒక నెల వాలిడిటీ ఉంది. ⚙️💬 అదనంగా రూ. 1234తో 168GB డేటాను అందించే ఒక సంవత్సరం ప్లాన్ కూడా ఉంది. అపరిమిత కాలింగ్ కూడా అందుబాటులో ఉంది. 📶🗣️