1 వాట్సాప్‌లో కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన మొదటి ఫీచర్ - 📱🔗 స్క్రీన్ షేరింగ్ ఫీచర్. సాధారణంగా ఇలాంటి స్క్రీన్ షేరింగ్ ఫీచర్ గూగుల్ మీట్, జూమ్ వంటి వీడియో కాలింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే తాజాగా వాట్సాప్ కూడా ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు వీడియో కాల్స్‌లో మాట్లాడుకునే సమయంలో తమ ఫోన్ స్క్రీన్‌ను షేర్ చేసుకోవచ్చు.
2 ఇక వాట్సాప్‌లో కొత్త అందుబాటులోకి వచ్చిన మరో ఫీచర్ - 🚫📞 స్పామ్ కాల్స్ రిస్ట్రిక్ట్ ఫీచర్. ఇటీవల వాట్సాప్‌లో స్పామ్ కాల్స్ ఎక్కువవుతోన్న విషయం తెలిసిందే. ఎవరో తెలియని నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ రావడం సైబర్ నేరాలు వంటివి జరగడకం చూస్తున్నాం. అయితే తాజాగా అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్‌తో ఇలాంటి స్పామ్ కాల్స్‌ను రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఇందుకోసం ముందుగా మీ వాట్సాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి, తర్వాత కాల్స్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి, చివరిగా ‘సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్’ అనే ఆప్షన్‌ను అనేబుల్ చేసుకుంటే సరిపోతుంది.
3 ఇక మూడో ఫీచర్ - ✏️✉️ ఎడిటింగ్ ఫీచర్. వాట్సాప్‌లో పొరపాటున తప్పుడు మెసేజ్ చేయడం సహజమే. అయితే ఇలా సెండ్ చేసిన రాంగ్ మెసేజ్‌ను ‘డిలీట్ ఫర్ ఆల్’ చేసి ఆ తర్వాత మళ్లీ సెండ్ చేస్తుంటాం. అయితే ఇందుకోసమే వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఎడిట్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ సహాయంతో మీరు తప్పుగా పంపించిన మెసేజ్‌ను ఎడిట్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు తప్పుగా పంపిన మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేయాలి. అనంతరం పైన ఉండే ‘త్రీ డాట్స్’పై క్లిక్ చేసి, ఎడిట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి, ఆ తర్వాత మెసేజ్‌ను ఎడిట్ చేస్తే అవతలి వ్యక్తికి ఎడిట్ అయిన మెసేజ్ కనిపిస్తుంది.