top of page

🚗గుడ్‌న్యూస్ !! రూ.99 వేలకే ఎలక్ట్రిక్ కారు🔌🤩

ఆధునిక యుగంలో బైక్ కొనాలంటే కనీసం ఒక లక్ష రూపాయలు పెట్టాల్సిందే! 🏍️ ఇక కారు కొనాలంటే లక్షలు వెచ్చించాల్సిందే! 🚗


అయితే కేవలం 99 వేల రూపాయలకే ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి రాబోతుంది. ⚡ నమ్మశక్యంగా లేదు కదూ! 🙅‍♂️ ఇది నిజం.. చైనాకు చెందిన అలీబాబా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుని తయారు చేసింది. 🏭 ముందు భాగంలో పులి ఆకారంలో ఉన్న ఈ కారులో కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించేలా రెండు సీట్లను ఏర్పాటు చేశారు. 🚘 ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫ్ ది వీక్ పేరిట సేల్ నిర్వహించిన అందులో ఈ కారుని 1199 డాలర్లకు విక్రయించినట్లు సమాచారం. 💰 అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు 99,000 రూపాయల వరకు ఉంటుంది. 💲 చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ ఇది గంటకు 120 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 🏞️ పట్టణ ప్రాంతాల్లో రోజువారీ వినియోగానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. 🏙️ కానీ ఈ కారుని చైనాలో తప్పా ఇతర దేశాలకు తీసుకెళ్లే ఛాన్స్ లేదట. 🌍 మొత్తానికి ఇది టాటా నానో కారుకంటే తక్కువ ధరకే లభించిందని తెలిసిపోతోంది. 🚗 కారు చిన్నగా ఉండటం వల్ల పార్కింగ్ కోసం తంటాలు పడాల్సిన అవసరం లేదు. 🅿️


Comentarios


bottom of page