top of page

మీ ఫోన్‌ బ్యాటరీ సరిగ్గానే పనిచేస్తుందా.? ఇలా చెక్‌ చేసుకోండి..🔋📱

ఒకవేళ మీరు ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను ఉపయోగిస్తుంటే. మీ ఫోన్‌ గత 24 గంటల బ్యాటరీ వినియోగం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.. అనంతరం బ్యాటరీ ఆప్షన్‌కు వెళ్లాలి. గత 24 గంటల్లో బ్యాటరీ వినియోగం ఎంత ఉందో, ఏ యాప్ ఎక్కువ బ్యాటరీని వినియోగించిందో తెలుసుకోవచ్చు. 🔍🕵️‍♂️

ఇక మీరు సామ్‌సంగ్ బ్రాండ్‌కు చెందిన ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు.. ప్లే స్టోర్ నుంచి 'శామ్‌సంగ్ మెంబర్ యాప్'ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌ఓని 'అసిస్టెంట్' ట్యాబ్ కింద 'సపోర్ట్'కి వెళ్లి, 'ఫోన్ డయాగ్నోస్టిక్' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే చాలు మీ బ్యాటరీకి సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తుంది. 📲🛠️

ఇతర కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు బ్యాటరీ హెల్త్‌ను తెలుసుకోవాలంటే ప్లేస్టోర్‌ నుంచి 'AccuBattery' అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం ఫోన్‌ను ఫుల్ ఛార్జ్‌ చేయాలి. తర్వాత యాప్‌ పనిచేయడం ప్రారంభించి, మీ బ్యాటరీ హెల్త్‌ను మీకు అందిస్తుంది. 🔋💡

ఇక మీ ఫోన్ డయల్‌ను ఉపయోగించి కూడా ఫోన్‌ బ్యాటరీ పనితీరును తెలుసుకోవాలంటే. ఇందుకోసం ముందుగా డయల్‌ను ఓపెన్‌ చేసి ##4636## ని ఎంటర్‌ చేయాలి. మెనూలో బ్యాటరీ ఇన్ఫర్మేషన్‌ను సెలక్ట్ చేసుకుంటే.. ఛార్జింగ్ లెవల్‌తో పాటు బ్యాటరీ టెంపరేచర్‌, హెల్త్‌ ఎలాం ఉందో తెలుసుకోవచ్చు. 📞🔍

మీ ఫోన్ బ్యాటరీ హెల్త్‌ను తెలుసుకోవడానికి CPU-Z అనే యాప్‌ కూడా ఉపయోగపడుతుంది. ఈ యాప్‌ను ప్లేస్‌టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల బ్యాటరీ ఇంక ఎంతసేపు వస్తుంది, బ్యాటరీ హెల్త్‌ ఎలా ఉంది.? టెంపరేచర్‌ ఎంత ఉంది.? లాంటి వివరాలను తెలుసుకోవచ్చు. 📱🔧

Komentarze


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page