top of page

వాట్సాప్‌ యూజర్లు డబ్బులు చెల్లించే సమయం వచ్చేసింది..⌚📱

ప్రస్తుతం ఆండ్రాయిడ్ వాట్సాప్‌ యూజర్లు తమ చాట్‌ బ్యాకప్‌ డేటాను గూగుల్ డ్రైవ్‌లో సేవ్‌ చేసుకుంటున్నారు విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సేవలు ఉచితంగా అందుబాటులో ఉండగా 2024 నుంచి గూగుల్ డ్రైవ్‌లో ఫ్రీ అన్‌లిమిటెడ్ బ్యాకప్‌లను అందించదని కంపెనీ తెలిపింది. 📅📂

ఇక నుంచి వాట్సాప్‌ బ్యాకప్స్‌కు లిమిటెడ్ స్టోరేజీ కోటా మాత్రమే లభిస్తుంది. గూగుల్‌ డ్రైవ్‌లో అందించే 15జీబీ స్టోరేజ్‌ లిమిట్‌ మాత్రమే ఉచితంగా అందిస్తారు. అయితే స్టోరేజీ పెంచుకోవాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సిందే. 💽💵

చాట్ బ్యాకప్స్‌కు గూగుల్ డ్రైవ్‌లో స్పేస్ కేటాయించే రూల్ 2024 ప్రారంభం నుంచి అమల్లోకి రానుంది. ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్ 2.23.26.7లో ఈ విషయాన్ని వివరిస్తూ ఓ మెసేజ్‌ వచ్చింది. గూగుల్ డ్రైవ్‌లో వాట్సాప్ బ్యాకప్‌లు ఇకపై అన్‌లిమిటెడ్‌ స్టోరేజ్‌ ఉచితంగా లభించని తెలిపారు. 🔄📦

వాట్సాప్‌ యూజర్లు ఇకపై తమ బ్యాకప్‌లను ఉంచుకోవాలనుకుంటే స్టోరేజ్‌ స్పేస్‌ మెయింటైన్‌ చేయాలి. లేదంటే ఎక్స్‌ట్రా స్టోరేజ్‌ కోసం డబ్బులు చెల్లించాలి. యూజర్లు ఎంత స్టోరేజీని ఉపయోగించుకున్నారో తెలియాలంటే.. వాట్సాప్ సెట్టింగ్స్‌లోని స్టోరేజ్ రివ్యూ ఆప్షన్‌లో తెలుసుకోవచ్చు. 📲🔍

ఇదిలా ఉంటే వాట్సాప్‌ చాట్‌ బ్యాకప్‌ స్టోరేజ్‌ కోసం ఎంత ఛార్జీ వసూలు చేస్తారన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియచేయనున్నట్లు సమాచారం. 🌐📄

留言


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page