top of page

📱 స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌..

 చైనా స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థ వివో తాజాగా గ్లోబల్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. వివో ఎక్స్‌ సిరీస్‌లో భాగంగా డిసెంబర్‌ 14వ తేదీన గ్లోబల్‌ మార్కెట్‌లోకి తీసుకురానున్న ఈ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్‌లోకి లాంచ్‌ చేయనున్నారు.

వివో ఎక్స్ 100 సిరీస్‌లో భాగంగా వివో ఎక్స్‌ 100, వివో ఎక్స్‌ 100 ప్రో పేర్లతో రెండు ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్‌ను అందించారు.

ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 120 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పని చేస్తుంది. చెన్ యీ బ్లాక్, స్టార్ ట్రయల్ బ్లూ, సన్ సెట్ ఆరేంజ్, వైట్ మూన్ లైట్ కలర్స్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది.

స్క్రీన్‌ విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 8టీ ఎల్టీపో కర్వ్‌డ్‌ డిస్‌ప్లే ఈ స్క్రీన్‌ సొంతం. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో ఈ స్క్రీన్‌ను తీసుకొచ్చారు.

వివో ఎక్స్‌ 100 సిరీస్‌ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. 64 మెగాపిక్సెల్ జీస్‌ పెరిస్కోప్‌ టెలిఫొటో కెమెరాను ఇవ్వనున్నారు. ఈ రెండు ఫోన్స్‌లోనూ 50 మెగపిక్సెల్‌ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాను అందించారు. ధర విషయానికొస్తే వివో ఎక్స్ 100 రూ. 45,000 కాగా వివో ఎక్స్‌ 100 ప్రో ధర రూ. 57,000గా ఉండొచ్చని అంచనా. 📲🔥

Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page