top of page
Shiva YT

🌊🐟 సముద్రం గుట్టు విప్పనున్న ‘మత్స్య 6000’..

‘మత్స్య 6000’ అని పిలిచే మొట్టమొదటి మానవసహిత సబ్‌ మెర్సిబుల్‌తో సముద్ర గర్భంలో ఉన్న వనరులను అధ్యయనం చేయనున్నారు.

సముద్ర గర్భంలో 6000 మీటర్ల లోతుకు సబ్‌మిర్సిబుల్ వెళ్తుందని, సముద్ర మట్టం కంటే లోపల 600 రెట్ల పీడనం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని రామదాస్‌ తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘మార్స్‌పై ఉన్న రోవర్‌ను భూమిపై నుంచి నియంత్రింవచ్చు. కానీ 20 మీటర్ల లోతున్న ఉన్న వాటిని నియంత్రించలేము. దీనికి కారణం విద్యుదయస్కాంత తరంగాలు ప్రయాణించలేవు. అంతలోతులో కమ్యునికేషన్‌ చేయడానికి వ్యవస్థ అందబాటులో లేదు. ఇక మత్స్య 6000లో ఎన్నో రకాల భద్రతా చర్యలు తీసుకున్నామని.. NIOT శాస్త్రవేత్త సత్యనారయణ్ తెలిపారు. సముద్ర గర్భంలోకి వెళ్లే సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆయన తెలుపారు. 500 మీటర్ల లోతులో పరీక్ష చేయించుకున్న ఉక్కుతో చేసిన ప్రెజర్ హల్‌ను రూపొందించింది. లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి ఏడు మీటర్ల లోతులో మనుషులతో కూడా దీనిని పరీక్షించారు. 🌐🔬

bottom of page