top of page

🔥 ఒకే వాట్సాప్..ఐదో ఫోన్లలో వాడుకోవచ్చు..

ఈ మోడ్ ఏంటంటే అనేక పరికరాల్లో ఒకే వాట్సాప్ ఖాతాను వినియోగించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. చాట్‌లు, కాంటాక్ట్ లు, గ్రూప్స్ అన్నీ కూడా ఆయా పరికరాలలో సింక్రనైజ్ అవుతాయి.

మీ వాట్సాప్ ఖాతాకు గరిష్టంగా ఐదు పరికరాలను లింక్ చేయవచ్చు. ఇలా సెటప్ చేసుకోండి.. సెటప్ ప్రక్రియ ఇప్పటికే ఉన్న లింక్డ్ డివైజ్‌ల ఫంక్షన్‌ను పోలి ఉంటుంది. అయితేఈ వాట్సాప్ కంపానియన్ మోడ్ ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్‌ల కోసం రూపొందించబడినందున ఆ ప్రక్రియకన్నా కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ ఫీచర్ అధికారికంగా ఏప్రిల్ 25, 2023న విడుదల అయ్యింది. మీ ప్రధాన ఫోన్లో వాట్సాప్ ను ఓపెన్ చేయాలి. ఓవర్ ఫ్లో మెనూ పై క్లిక్ చేయాలి. లింక్డ్ డివైజెస్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత గ్రీన్ లింక్ ఏ డివైజ్ బటన్ పై క్లిక్ చేయండి. మీ ఫోన్లో క్యూఆర్ కోడ్ డిస్ ప్లే అవుతుంది. అలా కాకుండా లింక్ విత్ ఫోన్ నంబర్ ఇన్ స్టిడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కూడా చేయొచ్చు. అందుకోసం మీ సెకండరీ ఫోన్లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసి, మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు మీకు వన్ టైం పాస్ కోడ్ వస్తుంది. అది ఎంటర్ చేస్తే రెండో ఫోన్లో కూడా మీ కాంటాక్ట్స్ సింక్రనైజ్ అవుతాయి. ఒకే వాట్సాప్ ఐదు ఫోన్లలో.. రెండు (లేదా అంతకంటే ఎక్కువ) ఫోన్‌ల నుంచి సందేశాలను మీరు చూడొచ్చు. కంపానియన్ మోడ్‌తో, మీరు ఒకేసారి ఐదు ఫోన్‌లలో వాట్సాప్ ని ఉపయోగించవచ్చు. సిమ్ కార్డ్ లేకుండా కూడా వాట్సాప్ మీ సెకండరీ ఫోన్‌లో పనిచేస్తుండటం ఇక్కడ విశేషం. మీరు మీ సెకండరీ ఫోన్‌లో వాట్సాప్ అందించే మెసేజ్‌లు, ఇమేజ్‌లు, వీడియోలను పంపడం, స్వీకరించడం వంటి అనేక ఫీచర్లను ఆస్వాదించవచ్చు. మీరు మీ సెకండరీ ఫోన్ నుంచి వాట్సాప్ వాయిస్, వీడియో కాల్‌లను కూడా చేయవచ్చు, స్వీకరించవచ్చు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page