🖼️ పోస్ట్ చేసిన ఫొటోకు ఫిల్టర్స్, ఎఫెక్ట్‌లను జోడించుకోవచ్చు. అలాగే క్యాప్షన్‌లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని సరిచేసుకోవచ్చు. పోస్ట్ చేసిన తర్వాత తప్పులను సరిదిద్దుకునే ఉద్దేశంతో ఈ ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చింది. ఇంతకీ ఈ కొత్త ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలి.? ఇప్పుడు తెలుసుకుందాం..
ఇందుకోసం ముందుగా ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయాలి.
అనంతరం ప్రొఫైల్‌లోకి వెళ్లి.. ఎడిట్ చేయాలనుకున్న పోస్టును సెలక్ట్ చేసుకోవాలి.
తర్వాత పోస్ట్‌కు కుడ వైపు టాప్‌లో ఉండే ఎలిప్సెస్ ను క్లిక్ చేయాలి. అనంతరం మోర్ ఆప్షన్స్ పై ట్యాప్ చేయాలి.
దీంతో అక్కడ మెనులో ‘ఎడిట్’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని సెలక్ట్ చేసుకోవాలి.
ఫొటోను ఎడిట్ చేయాలనుకుంటే దానిపై ట్యాప్ చేయడం వల్ల ఎడిటింగ్ టూల్స్ అందుబాటులోకి వస్తాయి. అనంతరం మీరు కోరుకున్న మార్పులు చేసి స్క్రీన్ కుడివైపు టాప్‌లో ఉన్న సేవల్ బటన్‌ను నొక్కాలి. అంతేకాకుండా మీ ఫొటో, క్యాప్షన్, లొకేషన్‌ట్యాగ్స్‌ను మార్చుకునే అవకాశ ఉంటుంది.
చివరిగా ఎడిట్ చేసిన పోస్టు మీకు కనిపిస్తుంది. మార్పులు చేసిన ఫొటో నచ్చిటనట్లైతే.. ఓకే లేదంటే మళ్లీ ఎడిట్ చేసుకోవచ్చు. 🎨