🇨🇳 చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్ తాజాగా కొత్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ప్రీమియం సెగ్‌మెంట్‌లో భాగంగా ఈ ఫోన్‌ను తీసుకురానున్నరు. వన్‌ప్లస్ 12 పేరుతో లాంచ్ చేయనున్నారు. డిసెంబర్ 4వ తేదీన ఈ ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేయనున్నండగా, వచ్చే ఏడాది జనవరిలో గ్లోబల్ లాంచ్ కానుంది.
🇮🇳 అయితే భారత్‌లో ఈ ఫోన్‌లు మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక వన్‌ప్లస్ 12 లాంచింగ్ కంటే ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 📱 ఈ స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఇక ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించనున్నారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ పని చేయనుంది. 📷 కెమెరా విషయానికొస్తే ఇందులో ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. ఇందులో 64 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన కెమెరాలు ఇవ్వనున్నారు. ఇక సెల్ఫీ విషయానికొస్తే ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. 🔋 ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 5400 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో పెరిస్కోప్ జూమ్ లెన్స్‌ను అందిచారు. దీంతో దూరంలో ఉన్న సబ్జెక్ట్స్‌ను కూడా హై క్వాలిటీ ఫొటోలను తీసుకోవచ్చు. ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా కర్వ్డ్ డిస్‌ప్లేను అందించారు. 📸