ఆధార్ కార్డులోని వేలి ముద్రలు, ఇతర బయోమెట్రిక్ డేటాను లాక్ చేయడం ద్వారా దుర్వినియోగాన్ని నిరోధించవచ్చు. ఇంతకీ బయోమెట్రిక్ లాకింగ్ ఎలా చేసుకోవాలి.? అన్‌లాక్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
బయోమెట్రిక్ లాకింగ్ కోసం ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.. 🔄👣
ఇందుకోసం ముందుగా మై ఆధార్ పోర్టల్‌లోకి వెళ్లి ఆధార్ నంబర్ నమోదు చేయాలి.
అనంతరం మైఆధార్ పోర్టల్‌లోకి ఓటీపీ ద్వారా లాగిన్ కావాలి.
స్క్రీన్ పై లాక్/ అన్‌లాక్ బయోమెట్రిక్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలేం.
ప్లీజ్ సెలెక్ట్ టూ లాక్ ఓపెన్ అవుతుంది. అనంతరం టర్మ్స్ బాక్స్‌లో టిక్ చేసి నెక్ట్స్‌పై క్లిక్ చేయాలేం.
అనంతరం బయోమెట్రిక్ లాక్ కాగానే.. ‘యూవర్ బయోమెట్రిక్ హావ్ బీన్ లాక్డ్ సక్సెస్‌ఫుల్లీ’ అనే మెసేజ్ వస్తుంది.
బయోమెట్రిక్ లాక్ కాగానే.. బయో మెట్రిక్ ఆప్షన్ లో ఎరుపు రంగు లాక్ స్క్రీన్‌పై కనబడుతుంది.
అన్‌లాక్ ఎలా చేసుకోవాలంటే.. 💻🛡️
ఆధార్ బయోమెట్రిక్ అన్‌లాక్ చేసుకోవాలంటే ముందుగా పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. వెంటనే.. లాక్/ అన్‌లాక్ బయోమెట్రిక్ ఆప్షన్ ఎరుపు రంగులో నిపిస్తుంది. బయోమెట్రిక్ లాక్ అయితే ఇలా కనిపిస్తుంది.
అన్‌లాక్ ప్రక్రియ కోసం ‘ప్లీజ్ సెలక్ట్ టూ లాక్’ టిక్ చేసిన తర్వాత రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
బయోమెట్రిక్ అన్‌లాక్ టెంపరరీ లేదా పర్మినెంట్ అనే మెసేజ్ కనిపిస్తుంది. మీకు కావాల్సిన ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకొని నెక్ట్స్‌పై క్లిక్ చేయాలేం.
వెంటనే బయోమెట్రిక్ హావ్ బీన్ అన్‌లాక్డ్ సక్సెస్‌ఫుల్లీ అనే మెసేజ్ కనిపిస్తుంది. 💪🔒