top of page

సామ్‌సంగ్‌ నుంచి బడ్జెట్‌ ఫోన్‌.. రూ. 12 వేలకే 50 ఎంపీ కెమెరా.. 📱🌟

ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్‌, 64 జీబీ వేరియంట్‌ ఫోన్‌ ధర రూ. 12,499గా నిర్ణయించనున్నారు. అలాగే 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 14,999గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 💳

💰లాంచింగ్‌ సమయంలో కొన్ని బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్‌ పొందొచ్చు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ పీఎల్‌ఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 1,600 x 720 పిక్సెల్‌, 60 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్‌ హీలియో జీ85 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందిస్తున్నారు. 📲💻

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌ OneUI 5.1తో రన్ అవుతుంది. ఇక బ్యాటరీ వవిషయానికొస్తే ఇందులో 25 ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు. 🔋

కెమెరాకు సైతం ఇందులో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ05 ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను ఇవ్వనున్నారు. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ సైడుకు అందించారు. 📸📷

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page