ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఎన్నో రకాల గ్యాడ్జెట్స్ ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ టెక్నాలజీతో తొలి స్మార్ట్ వాచ్ వచ్చేసింది. భారత్‌లో ఛాట్ జీపీటీతో విడుదలైన తొలి స్మార్ట్ వాచ్ ఇదేకావడం విశేషం.
క్రాస్ బీట్స్ నెక్సస్ పేరుతో ఈ వాచ్‌ను లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ వాచ్ ముందస్తు బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. గత నెలలో ఈ వాచ్‌ను లాంచ్ చేశారు. ఇక ఈ వాచ్ ధర విషయానికొస్తే దీని ధరను రూ. 5,999గా నిర్ణయించారు. ఈ వాచ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు.
ఇక ఈ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 2.1 ఇంచెస్‌తో కూడిన అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 320 x 384 పిక్సెల్‌ల రిజల్యూషన్ ఈ వాచ్ స్క్రీన్ సొంతం. ఈ వాచ్‌కి 500కిపైగా వాచ్ ఫేస్‌లు ఉన్నాయి.
బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో పనిచేసే ఈ స్మార్ట్ వాచ్‌తో నేరుగా ఫోన్ మాట్లాడుకోవచ్చు. ఇందుకోసం ఇన్‌బిల్ట్ స్పీకర్‌ను అందించారు. జీపీఎస్ డైనమిక్ రూట్ ట్రాకింగ్ ఈ వాచ్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.
ఇక ఈ వాచ్‌లో అల్టీమీటర్, బేరోమీటర్, హార్ట్ రేట్ ట్రాకర్, ఎస్‌పీఓ2 లెవెల్స్ మానిటర్, స్లీప్ మానిటర్, బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ వంటి హెల్త్ ఫీచర్లను అందించారు. ఈ వాచ్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. 🔋