top of page

📱 వన్‌ప్లస్‌ నుంచి మరో స్టన్నింగ్‌ స్మార్ట్‌ ఫోన్‌..

🌐 చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. వన్‌ప్లస్‌ ఏస్‌3 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. 📲

మెటల్‌ ఫ్రేమ్‌ డిజైన్‌తో ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. 🌟 ఇప్పటి వరకు ఈ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

💡 అయితే ఇంటర్నెట్‌లో లీక్‌ అయిన సమాచారం మేరకు ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వీటి ప్రకారం వన్‌ప్లస్‌ ఏస్‌3 ఫోన్‌లో 1.5కే రిజల్యూషన్‌తో కూడిన కర్వ్‌డ్‌డ్‌ డిస్‌ప్లేను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 📊 ఇక ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేయనుంది.

📱 ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ చేయనుంది. ఇక ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

📸 ఇక కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనన్నారు. 📷 ఇక ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌, 8 మెగాపిక్సెల్స్‌, 32 మెగాపిక్సెల్ కెమెరాలను ఇవ్వనున్నారు. 📸 ఇక సెల్ఫీల విషయానికొస్తే ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు.

🌐 ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ అనే ఫీచర్‌ను కెమెరాలో ప్రత్యేకంగా అందించారు. 📷 ఇక ఈ ఫోన్‌లో 100 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. 🔋 ఇక ఈ ఫోన్‌లో డిన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను అందించారు. 👆 ఐపీ68 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెంట్‌ అందించారు. 💦✨

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page