top of page

📱 వావ్ అనేలా వివో కొత్త వాచ్.. సూపర్ స్మార్ట్ ఫీచర్లు..

📅 వివో వాచ్ 3 నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. బ్లాక్, బ్రైట్ మూన్, మూన్‌లైట్ వైట్ స్టార్‌లైట్ రంగుల్లో మీకు నచ్చని కలర్లో దీనిని కొనుగోలు చేయొచ్చు. 🎨

ప్రస్తుతం చైనాలో మాత్రమే ఈ వాచ్ విక్రయానికి ఉంది. ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. వివో వెబ్ సైట్లోకి వెళ్లి ప్రీ బుక్ చేసుకోవచ్చు. 📆 నవంబర్ 21 నుంచి అధికారికంగా విక్రయాలు ప్రారంభమవుతాయి.

వివో వాచ్3 ధర.. సాఫ్ట్ రబ్బర్ స్ట్రాప్ తో వచ్చే బ్లూటూత్ వాచ్ ధర CNY 1,099 (దాదాపు రూ. 12,600)గా ఉంది. లెదర్ స్ట్రాప్ తో వచ్చే బ్లూటూత్ వాచ్ ధర CNY 1,199 (దాదాపు రూ. 13,700)గా ఉటుంది. సాఫ్ట్ రబ్బర్ స్ట్రాప్ తోపాటు ఈ-సిమ్ సపోర్టుతో వచ్చే వాచ్ దర CNY 1,299 (దాదాపు రూ. 14,900)గా ఉంది. లెదర్ స్ట్రాప్ తో పాటు ఈ-సిమ్ సపోర్టుతో వచ్చే వాచ్ ధర CNY 1,399 (దాదాపు రూ. 16,000)గా ఉంది.

వివో వాచ్3 1.43-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 4జీబీ ర్యామ్, 64జీబీ అంతర్గత నిల్వతో వస్తుంది. వివో సొంత బ్లూఓఎస్‌ తో వస్తుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ జోవి అసిస్టెంట్‌ని కలిగి ఉంది. 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. ఇది మీ ఆరోగ్యం, నిద్ర విధానాలను కూడా ట్రాక్ చేస్తుంది. హృదయ స్పందన రేటు, రక్త ఆక్సిజన్ పర్యవేక్షణ కోసం ఆరోగ్య సెన్సార్ ఉంటుంది. ఈ వాచ్3 బ్యాటరీ లైఫ్ ఆకట్టుకుంటుంది. ఈ-సిమ్ మోడల్ రోజులు, బ్లూటూత్ వెర్షన్ 16 రోజుల వరకూ బ్యాటరీ ఉంటుంది. 🔋✨

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page