top of page

తక్కువ బడ్జెట్‌లో 108 మెగాపిక్సెల్‌ కెమెరా.. రెడ్‌మీ నుంచి కొత్త ఫోన్‌ 📸📱

ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ ఓ బడ్జెట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. రెడ్‌మీ నోట్‌ 13ఆర్‌ ప్రో పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

అయితే ఈ ఫోన్‌ను బడ్జెట్‌ ధరలోనే తీసుకొస్తుండడం విశేషం. ఇదిలా ఉంటే రెడ్‌మీ ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలను ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు, అయితే నెట్టింట ఈ ఫోన్‌కు సంబంధించిన ఫొటోలు, ఫీచర్లు లీక్‌ అయ్యాయి. త్వరలోనే రెడ్‌మీ ఈ ఫోన్‌ విడుదల తేదీతో పాటు, ధరకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. నెట్టింట వైరల్‌ అవుతోన్న సమాచారం మేరకు ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయంటే. రెడ్‌మీ నోట్‌13ఆర్‌ ప్రో స్మార్ట్ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడి డిస్‌ప్లేను అందించనున్నారు. హోల్ పంచ్‌తో కూడిన స్క్రీన్‌ను అందించనున్నారు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారు. ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. దీంతో మంచి క్వాలిటీతో కూడిన ఫొటోలను తీసుకోవచ్చు. ఇక సెల్ఫీల కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. ఇక ధర విషయానికొస్తే చైనాలో ఈ స్మార్ట్‌ ఫోన్‌ 1999 యువాన్లుగా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. భారత కరెన్సీ ప్రకారం రూ. 23,000వేలుగా ఉండొచ్చని అంచనా. అయితే భారత్‌లో ఈ ఫోన్‌ ధర మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను 12జ జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌తో తీసుకురానున్నారు. 📷🤳🚀

Commenti


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page